ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక పరుగుల సరికొత్త రికార్డు నమోదైంది. IPL-2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు కలిసి ఏకంగా 439 పరుగులు సాధించాయి. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ 243 రన్స్ చేయగా, హైదరాబాద్ 196 పరుగులు చేసింది. దీంతో 2025లో నమోదైన 436 (MI vs GT) పరుగుల రికార్డు బద్దలైంది.