KDP: వేముల మండల పరిధిలోని గొందిపల్లె గ్రామంలో బుధవారం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లలో భాగంగా గొందిపల్లె గ్రామంలో హౌస్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థులతో మాట్లాడి ఎన్యుమరేషన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.