IPL 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో SRHకు గట్టి షాక్ తగిలింది. RR నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 33 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్మరన్ కూడా అవుట్ అవ్వడంతో కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఉన్నారు.