TG: ఇంటర్ విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్‌లో వెరైటీలు అందించనున్నారు. దోశ, పూరీ, ఇడ్లీ, మిల్లెట్, బోండా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయసుకు తగిన పోషకాలు అందేలా రూపకల్పన చేశారు. 1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్‌కు ఏటా రూ.180 కోట్లు ఖర్చు చేయనుంది. జూన్ 12న సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది.