ELR: పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలపర్రు టోల్ గేట్ వద్ద రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న 15 మంది ద్విచక్ర వాహనదారులను ఆపి, జరిమానాలు వేయకుండా అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. హైవే ప్రయాణాల్లో హెల్మెట్ ప్రాణ రక్షకమని, నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదమన్నారు.