SRD: జిల్లాలో అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వల్ల వరి ధాన్యం తడిచి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.