ASF: జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నందున అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొటారి గ్రామంలో ఇందిరమ్మ నివాస గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం, లబ్ధిదారులతో కలిసి భోజనం, ముఖాముఖి కార్యక్రమం ఉంటుందన్నారు.