ASR: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లూరి జిల్లాలో రాజకీయ అంశాలపై జగన్తో చర్చించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ చెప్పారన్నారు.