VSP: భీమిలి నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మహానాడు కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. తగరపువలస, భీమిలి, జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోని వివిధ క్లస్టర్లలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.