ASF: జిల్లా BJP అధ్యక్షులు శ్రీ ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరభద్ర చారిలు బుధవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ని కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, తదితర అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. BJP బలోపేతం కోసం కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారన్నారు.