ADB: ఉట్నూర్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ సింగ్ పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని మోహన్ సింగ్కు సూచించారు.