BDK: మణుగూరులో జాతీయ వినియోగదారులు & మానవ హక్కుల పరిరక్షణ సమితి 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అధికారులు కట్టుబడి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులకు డైరీలు అందజేసి సత్కరించారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.