AP పేపర్ మిల్ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిందని మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిశ్రమ నుంచి విడుదలైన రసాయనాల్లో పీహెచ్ స్థాయి 7 శాతం నమోదైనట్లు చెప్పారు. పరిశ్రమల నుంచి మురుగునీరు నేరుగా బయటకు వస్తే యాజమాన్యాన్ని జైలుకు పంపిస్తామని, గోదావరిలో వ్యర్థాలు కలిపితే ఆ పరిశ్రమలకు తాళాలు వేస్తామని మంత్రి దుర్గేష్ వార్నింగ్ ఇచ్చారు.