JGL: చల్గల్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని సదుపాయాలతో పాఠశాలలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.