PPM: జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్య అవకాశం ఉందని కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవకాశం ఉందన్నారు.