NLR: కోవూరు మండలం పడుగుపాడు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.