SRCL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. కరోనా సమయంలో సేవలందించిన కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ నేతలు విమర్శించారు.