GDWL: గద్వాల మండలం మదనపల్లి గ్రామంలో గ్రామ దేవత సవరమ్మ దేవరాల ఉత్సవాలు గ్రామస్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.