అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎండ వేడిమికి ఇబ్బంది పడుతున్న గర్భిణీలు, బాలింతలను మూడవ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్‌కు మార్చి ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఆ బ్లాక్‌ను వినియోగం తీసుకురావాలన్నారు.