KNR: కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్లా గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సిసి రోడ్డును బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ కురుమ సంఘ పెద్దలు బీరప్ప అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి బండి సంజయ్‌ని కోరడంతో, నిధులు మంజూరుకు ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు.