ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని చింతపల్లి ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు. బుధవారం చింతపల్లి వారపు సంతలో ఈగిల్ టీమ్‌తో కలిసి సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. గంజాయి వల్ల జీవితాలు నాశనం అవుతాయని, జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీంతో ఎన్నో జీవితాలు రోడ్డున పడుతున్నాయన్నారు.