టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రస్తుత మూవీలతో బిజీగా ఉన్నారు. ఆ కమిట్మెంట్స్ పూర్తి కాగానే ఈ కొత్త సినిమా స్టార్ట్ కానుందట. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.