AP: క్వాంటం, AI, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్‌కు AP చిరునామాగా మారిందని TDP అధినేత, CM చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 23 లక్షల మందికి ఉపాధి లభించిందని మహానాడు వేదికగా ప్రకటించారు. వీటిలో రూ.11.27 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు.