‘జై భీమ్’ వంటి బ్లాక్‌బస్టర్ క్లాసిక్ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు T.J జ్ఞానవేల్ మరోసారి చేతులు కలపనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘సూర్య-48’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను సూర్య హోమ్ బ్యానర్ ‘జగరం స్టూడియోస్’ నిర్మించే అవకాశం ఉండగా, షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానుందని టాక్.