BHPL: తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన కోండ్ర వెంకటేష్ మృతదేహాన్ని బుధవారం 100 పడకల ఆసుపత్రిలో CPI(ML), AICCTU నేతలు సందర్శించి, నివాళులర్పించారు. CPI(ML) జిల్లా కార్యదర్శి మల్లేష్, AICCTU అధ్యక్షుడు క్రాంతి మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.