TG: గాంధీభవన్లో రసాభాసపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పందించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ బలపడిందనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. ప్రాధాన్యత కోరుకునే క్రమంలో చిన్న సంఘటన జరిగినట్లు చెప్పారు. పార్టీ బలంగా ఉంది కాబట్టే నేతల మధ్య ప్రాధాన్యత ఫైట్ జరిగిందన్నారు. వాళ్లిద్దరూ మళ్లీ ఏకమయ్యారని వెల్లడించారు. ఘటనపై క్రమశిక్షణ కమిటీ కూడా పరిశీలిస్తుందని వివరణ ఇచ్చారు.