NLR: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను మాజీ సీఎం జగన్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.