KRNL: మంత్రాలయంలో శ్రీ మఠం అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న భారీ వృక్షాన్ని నరికేయకుండా వేర్లతో సహా తొలగించి బుధవారం పరిమళ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో నాటించారు. ‘పర్యావరణాన్ని రక్షించాలి.. చెట్లను నరకకూడదు’ అనే సందేశంతో ఈ చర్య చేపట్టినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. కూల్చివేతకు గురయ్యే ప్రమాదంలో ఉన్న ఈ వృక్షం.. ఇక విద్యార్థులకు నీడనివ్వనుంది.