HYD: HMWSSBలో 170కు పైగా ఇంజనీరింగ్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అధికారులపై పనిభారం పెరుగుతోంది. నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ పనులు సిబ్బంది కొరతతో ప్రభావితమవుతున్నాయని సమాచారం. ఖాళీలను భర్తీ చేయకుండా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై ఇంజనీర్లను తీసుకురావడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.