MDCL: ఉప్పల్ నియోజకవర్గంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమాచార, ప్రజాసంబంధాల శాఖ కమిషనర్ ముకుంద్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.