VSP: మధురవాడ జోన్ వార్డు-7 మార్కెట్ రోడ్డులో బుధవారం జీవీఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జోనల్ కమిషనర్ వి.ఇప్పినాయుడు మాట్లాడుతూ.. పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా అందించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో విశాఖను దేశంలోనే ఉత్తమ పరిశుభ్ర నగరంగా తీర్చిదిదలాన్నారు.