కోనసీమ: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల(ఎస్సీ) సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం అమలాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజోలు మండలం చెందిన బత్తుల రమేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేష్ బాబుకు పలువురు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు.