ADB: MLA పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల ముందు సీసీఐని తెరిపిస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నించారు.