PDL: ధర్మారం మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎంఎస్ సమావేశం ఏపీఎం పోశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త వీవో భవనాల నిర్మాణాలు, సోషల్ మొబిలైజేషన్, బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి, యూనిట్ల గ్రౌండింగ్, ఆర్టీసీ బస్సు సౌకర్యం, ఐఎంఎస్ చీరల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.