BHPL: కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవాదాయ శాఖ సహకారంతో పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురుశ్రీ గజ్జెల రంజిత్ కుమార్ బృందం పేరిణి శివతాండవ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. “సత్యం శివం సుందరం” జుగల్బందీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.