SS: హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని శ్రీకంఠపురం 8, 9వ వార్డు సచివాలయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జునతో కలిసి రికార్డులను పరిశీలించారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను సమీక్షించిన జేసీ, సంక్షేమ పథకాలు, శానిటేషన్, సర్టిఫికేట్ల జారీ వేగవంతం చేయాలన్నారు.