GNTR: నగరంలో వీధి కుక్కల సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ప్రత్యేక డాగ్ ఫీడింగ్ షెడ్లు ఏర్పాటు చేసినట్లు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. రామిరెడ్డినగర్, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ షెడ్లు ఏర్పాటు చేశారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఆహారం వేయకుండా ప్రజలు ఈ షెడ్లలోనే ఆహారం, నీరు అందించాలని కోరారు.