NGKL: బక్రీద్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఊర్కొండ ఎస్సై రమాదేవి ప్రజలకు సూచించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.