MBNR: హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో గుండె బైపాస్ సర్జరీ చేయించుకొని చికిత్స పొందుతున్న హాన్వాడ మండల బీఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ నరేందర్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన నరేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.