TPT: రామచంద్రపురం(M) అనుపల్లి పంచాయతీలో పరిశ్రమల స్థాపనకు 100-150 ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌తో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ భూమిని పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించుకునే అవకాశాలపై చర్చలు జరిగాయని, దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.