SRCL: మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామాల్లో నిర్మిస్తున్న నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, సమాజంలో జరిగే అన్ని అంశాలపై చర్చించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా గంభీరావుపేట మండలం రాజేశ్వర్ రావు కాలనీలో భవనాన్ని ప్రారంభించారు.