గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ మరో మైలురాయికి చేరుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ను అదానీ పవర్ అధిగమించింది. దీంతో భారత్‌లో 11వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కంపెనీ మార్కెట్ విలువ 68 శాతం వృద్ధి సాధించి రూ.4.85 లక్షల కోట్లకు చేరింది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ (రూ.4.72 లక్షల కోట్లు)ను దాటేసింది.