NDL: సంజామల మండలం పేరుసోమల గ్రామంలో ఇవాళ బీసీ ఇందిరమ్మ పర్యటించారు. శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి 16వ కళ్యాణ మహోత్సవంలో బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవంలో ఆమె స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం బీసీ ఇందిరమ్మ శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.