E.G: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. గోదావరి కాలుష్యంపై పవన్ భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. కాలుష్య జలాలు విడుదల చేసే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి పుష్కరాల కోసం రూ.8,600 కోట్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించారు.