MDK: లారీల కోసం రైతన్నలు రంగంపేటలో రాస్తారోకో నిర్వహించారు. వారం రోజుల నుండి రంగంపేట సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన రంగంపేట, పైతర, తుక్కాపూర్, మాందాపూర్ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లారీలు రాకపోవడంతో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు దాన్యం తడిసి ముద్దయింది. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఒక్కసారిగా మెదక్- సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.