AP: సమర్థ నాయకత్వం కోసం TDP ఎప్పుడూ పనిచేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. జనాభా దామాషా ప్రకారం అందికీ న్యాయం చేయడమే పార్టీ సిద్ధాంతమని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు TDP రుణపడి ఉంటుందని, వారికి పార్టీలో, ప్రభుత్వ పథకాల్లో సముచిత స్థానం కలిపిస్తున్నామని.. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మహానాడులో స్పష్టం చేశారు.