GNTR: వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద బుధవారం ఓ ప్రమాదం జరిగింది. మిర్చి బస్తాలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. పరిమితికి మించి అధిక లోడు వేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణనష్టం, గాయాలు తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.