NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు సాగునీటి కాలువల పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. నేరడ నుంచి బీరెల్లిగూడెం, గంగోరీగూడెం, పులిపలుపుల, కలవలపల్లి వరకు సాగే కాలువ పనులను మాజీ డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ దోటి నారాయణ ప్రారంభించారు.