AP: ప్రధాని మోదీకి వంగి వంగి నమస్కారాలు పెట్టడం తప్ప.. ఈ రెండేళ్లలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. TDP నేతలు సూపర్ సిక్స్‌ను సూపర్ సున్నా చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ జగన్‌ను విమర్శిస్తున్నారని.. పవన్‌ను పొగడటం తప్ప చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.