నల్గొండ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను దివాలా తీసే ప్రయత్నం చేస్తుందని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్ కుమార్ అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దానికి నిరసనగా నకిరేకల్‌లో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు.